పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వింటుంటే నాకు బాధేస్తోంది: నారా లోకేశ్

28-05-2018 Mon 15:01 | Andhra
  • ఉద్దానంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు దిగింది
  • కుప్పంకు కేటాయించిన తాగునీటి ప్లాంట్లనూ ఉద్దానానికే ఇచ్చాం
  • పద్ధతి ప్రకారం నడుచుకుంటున్న నాపై ఆరోపణలు చేస్తున్నారు
  • నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసురుతున్నా
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే తనకు బాధేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలో రెండో రోజు మహానాడులో ఆయన మాట్లాడుతూ, ఉద్దానంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు దిగిందని చెప్పారు. ఉద్దానంలో నీటిప్లాంట్లు ఏర్పాటు చేశామని, కుప్పంకు కేటాయించిన తాగునీటి ప్లాంట్లను కూడా ఉద్దానానికే ఇచ్చామని, పవన్ కల్యాణ్ ఈ విషయాలను గుర్తించాలని సూచించారు.

పద్ధతి ప్రకారం నడుచుకుంటుంటే విపక్ష పార్టీలు తనపై ఆరోపణలు చేస్తున్నాయని, తాను చేసిన తప్పులేంటో సాక్ష్యాలతో సహా నిరూపించాలని, అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. మహానాడు వేదికగా తాను సవాల్ విసురుతున్నానని, తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తన తాత, తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా ఎప్పుడూ వ్యవహరించనని, రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు 68 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపై ప్రతిపక్షాలు నడుస్తున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తే తిప్పి కొట్టే బాధ్యత తమపై ఉందని అన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, తిరుమల వెంకన్నను రాజకీయాల్లోకి లాగుతున్నారని, వెంకన్న జోలికొస్తే ఎలా మాడిమసైపోతారో అందరికీ తెలుసని అన్నారు.
Vijayawadamahanadu

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more