తాతయ్యను తలచుకుని ఎన్టీఆర్ భావోద్వేగం... అభిమానుల కళ్లల్లో ఆనందబాష్పాలు!
Add ap7am to your home Screen

తాతయ్యను తలచుకుని ఎన్టీఆర్ భావోద్వేగం... అభిమానుల కళ్లల్లో ఆనందబాష్పాలు!

  • నేడు దివంగత ఎన్టీఆర్ జయంతి 
  • వైభవంగా జరుపుకుంటున్న నందమూరి అభిమానులు
  • తాతయ్యను తలచుకుంటూ పోస్టర్ ను విడుదల చేసిన ఎన్టీఆర్
"మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది...
మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది...
పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..
- సదా మీ ప్రేమకు బానిసను"

అంటూ తన తాతయ్య దివంగత నందమూరి తారక రామారావును తలచుకుంటూ భావోద్వేగంతో కూడిన ఓ పోస్టర్ ను ఎన్టీఆర్ విడుదల చేయగా, దాన్ని చూసిన అభిమానుల కళ్లల్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయి. నేడు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు వైభవంగా జరుపుకుంటున్న వేళ, ఆయన రూపాన్ని పుణికిపుచ్చుకున్న మనవడిగా, తెలుగు సినీ వినీలాకాశంలో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్, తాతపై తనకెంత ప్రేమ ఉందో ఈ పోస్టరుతో మరోసారి చెప్పకనే చెప్పారు. 
NTR
Birthday
Poster

More Telugu News