పెళ్లి కాలేదా.. అయితే రూమ్ ఇవ్వమన్న ముంబై హోటల్!

  • సెలవుల్లో ఇండియాకు వచ్చిన యువకుడు
  • అతనికి ఇండియాను చూపిస్తున్న ప్రియురాలు
  • ముంబైలో గది ఇచ్చేది లేదన్న ఫ్యాబ్ హోటల్
  • పెళ్లి కాలేదన్న కారణంతోనే
ఇంకా పెళ్లి చేసుకోని ఓ ప్రేమ జంటకు గది ఇచ్చేందుకు ముంబైలోని ఫ్యాబ్ హోటల్ నిరాకరించింది. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువతికి యూకేలో పీజీ చదువుతున్న అమెరికన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సెలవుల్లో ఇండియా చూసేందుకు ప్రియుడు రాగా, ఈ జంట దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ముంబై చేరుకుంది.

అక్కడికి వచ్చే ముందే అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని ఫ్యాబ్ హోటల్ లో ఈ జంట ఓ రూమ్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంది. తీరా హోటల్ కు వచ్చి చెకిన్ అవుదామనుకున్న సమయంలో, పెళ్లి కాని జంటలకు తాము రూము ఇచ్చేది లేదని హోటల్ మేనేజ్ మెంట్ తెగేసి చెప్పింది. తాము ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించామని, ఎక్కడా ఈ సమస్య ఎదురు కాలేదని ఆ జంట వాపోయినా ఫలితం లేకపోయింది.

పెళ్లి కాలేదన్న కారణం చెబుతూ, గది నిరాకరించడం ఏంటని వారు ప్రశ్నించినా, ఫలితం లేకపోయింది. ఇది తమ విధాన నిర్ణయమని, పెళ్లి కాకుంటే రూమ్ ఇవ్వబోమని ఫ్యాబ్ హోటల్ ప్రతినిధి చెప్పారు.
Go Back to Shorts
India
Tourist
Lovers
Marriage
Fab Hotel
Mumbai
No Room

More Telugu News