కేరింతలు కొట్టిన ప్రాణం క్షణాల్లో గాల్లోకి... అనంతపురం ఎగ్జిబిషన్ లో విరిగిపడ్డ జెయింట్ వీల్!

28-05-2018 Mon 08:51 | Both States
  • ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం
  • బోల్టు ఊడి విరిగిపడ్డ ట్రాలీ కార్ 
  • బాలిక మృతి, మరో ఆరుగురికి గాయాలు
అనంతపురంలో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ ను ఎక్కిన పిల్లలు, పెద్దలు ఆనందంగా కేరింతలు కొడుతున్న వేళ, ఆ జెయింట్ వీల్ విరిగిపడింది. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో 10 ఏళ్ల వయసున్న బాలిక అమృత అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

జెయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో, ఓ ట్రాలీ కార్ బోల్టు ఊడిపోయి, అది కిందపడుతూ మరో రెండు ట్రాలీ కార్ లపై పడిందని తెలుస్తోంది. గాయపడిన వారిని అనంతపురం జనరల్ హాస్పిటల్ కు తరలించారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్ కు ఆదివారం కలసిరావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సదరు ట్రాలీ కార్ బోల్టు లూజుగా ఉన్నదని తాము చెప్పినా, జెయింట్ వీల్ ఆపరేటర్ పట్టించుకోలేదని ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో ఆపరేటర్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Anantapur DistrictExhibitionGaint WheelTrolly Car Crash

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more