నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల కూడా ఒకరు : మెగాస్టార్ చిరంజీవి

27-05-2018 Sun 15:03 | Entertainment
  • మాదాల రంగారావుకు నివాళులర్పించిన చిరంజీవి
  • కుటుంబసభ్యులను పరామర్శించిన అగ్రహీరో
  • మాదాలతో తన ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మెగాస్టార్
కమిట్ మెంట్ ఉన్న కథానాయకుడు మాదాల రంగారావు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ లో మాదాల రంగారావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం, మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, "నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి మాదాల రంగారావు గారితో పరిచయం ఉంది. ఇంకా చెప్పాలంటే, నాతో అత్యంత సన్నిహితంగా ఉండి, నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో దర్శకుడు టి.కృష్ణ, మాదాల రంగారావు గారు కూడా ఉన్నారు.

ప్రత్యేకించి నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఒంగోలులో నేను చదువుకున్న రోజుల నుంచి వారితో పరిచయాలు ఉన్నాయి. దీంతో, నాపై ఆయన ప్రత్యేక అభిమానం చూపించే వారు. ‘మనం ఒంగోలు నుంచి వచ్చామయ్యా! నువ్వూ అభివృద్ధిలోకి రావాలి.. మన ఒంగోలు పేరు నిలబెట్టాలి’ అని ఎంతో ఉత్సాహపరిచేవారు. ఒక కమిట్ మెంట్ తో విప్లవాత్మక సినిమాల్లోనే మాదాల నటించారు. కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు ఆయనకు వచ్చినప్పటికీ తిరస్కరించారు.  ఈరోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మాదాల మరణంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మాదాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అన్నారు.
Tollywoodmadala ranga raoChiranjeevi

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more