హైదరాబాద్ కు పాకిన వదంతులు... అమాయకుడిని కొట్టి చంపారు!
- పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయని వదంతులు
- ముగ్గురిపై రాళ్లు రువ్విన స్థానికులు
- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
వారి నుంచి సరైన సమాధానాలు రాకపోగా, వారిని కిడ్నాపర్లు, దొంగలుగా భావిస్తూ స్థానికులు చావబాదారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరణించిన వ్యక్తి మహబూబ్ నగర్ కు చెందినవాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో పలువురు పోలీసులకూ గాయాలు అయ్యాయి. ఆపై కొందరిని అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడికి దిగి, పెట్రోలింగ్ వాహనాన్ని ధ్వంసం చేశారు.