పల్లీ పకోడీలో చచ్చిన బల్లి.. నిర్ఘాంతపోయిన వినియోగదారుడు!

26-05-2018 Sat 10:52 | Telangana
  • హైదరాబాద్ లోని రామంతాపూర్ లో సంఘటన
  • శ్రీసాయి గణేష్ హోటల్, చిప్స్ దుకాణంలో పల్లీ పకోడి కొనుగోలు
  • ప్యాకెట్ లో చచ్చిన బల్లి.. ఫిర్యాదు చేసిన స్పందించని యజమాని
పల్లీ పకోడి తిందామనుకున్న వినియోగదారుడు నిర్ఘాంతపోయిన సంఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్ లో జరిగింది. పల్లీ పకోడి తిందామని ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగా, అందులో చచ్చిన బల్లి కనపడటంతో సదరు వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. దూరదర్శన్ కేంద్రం ఎదురుగా ఉన్న శ్రీసాయి గణేష్ హోటల్, చిప్స్ దుకాణంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి పల్లీ పకోడీల ప్యాకెట్ ని నిన్న కొనుగోలు చేశాడు. తిందామని ఆ ప్యాకెట్ విప్పగా చచ్చిన బల్లి ఉంది.

ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు తిరిగి ఆ దుకాణానికి వెళ్లాడు. నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధిత వినియోగదారుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన శానిటేషన్ అధికారులు ఆ దుకాణాన్ని పరిశీలించారు. తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీలు లేకపోవడాన్ని గమనించారు. షాపు యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు. తదుపరి చర్యలు తీసుకుంటామని ఉప్పల్ మున్సిపల్ ఏవోఎంహెచ్ ఉమా గౌరి తెలిపారు.
uppalhotelpalli pakodi

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more