పరీక్షలో చూసిరాత కోసం.. విద్యార్థులు తెచ్చిన చిట్టీల బరువు రెండొందల కిలోలు!

24-05-2018 Thu 17:19 | National
  • 12వ తరగతి సైన్స్ పరీక్షకు చిట్టీలతో వచ్చిన విద్యార్థులు
  • బయటపడ్డ చిట్టీలు రెండొందల కిలోలు
  • రెండు గోనె సంచులకు సరిపడ చిట్టీలు!
ఏదోవిధంగా పరీక్షల్లో గట్టెక్కితే చాలనుకునే విద్యార్థులు చిట్టీలు (స్లిప్స్) పెట్టుకుని వెళుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఎగ్జామినర్ కంటపడకుండా వెంట తెచ్చుకున్న చిట్టీలను జాగ్రత్తగా రాసుకుని బయటపడే విద్యార్థులు కొందరైతే, పట్టుబడే విద్యార్థులు కొందరుంటారు.  

ఇక విషయానికొస్తే, గుజరాత్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పుకోవాలి. జునాగఢ్ జిల్లాలోని వంథాలీలో ఇటీవల 12వ తరగతి సైన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు కొందరు చిట్టీలు తీసుకుని వచ్చారు. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు తమ వద్ద ఉన్న చిట్టీలను ఆయా విద్యార్థులు పరీక్ష ప్రారంభమవడానికి ముందే బయటపెట్టారు. ఆ విద్యార్థులు బయటపెట్టిన చిట్టీలు ఇరవై గోనె సంచులకు సరిపడా ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

ఈ సంఘటనపై డీఈవో బీఎస్ కెల్లా మాట్లాడుతూ, స్వామి నారాయణ్ గురుకుల్ పరీక్షా కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ మార్చి 14న తమకు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. ఆరోజున పదో తరగతి పరీక్ష జరుగుతోందని అన్నారు. చిన్న చిన్న కాగితాలతో అక్కడి రోడ్లు నిండిపోయాయని, అవి అంతకుముందు జరిగిన పరీక్షలకు సంబంధించిన చిట్టీలని చెప్పారు.

దీంతో, 12వ తరగతి విద్యార్థులందరినీ తమ వద్ద ఉన్న చిట్టీలన్నీ వెనక్కి ఇచ్చివేయాలని మూడుసార్లు హెచ్చరించడంతో ఆ చిట్టీలను బయటపెట్టారని అన్నారు. విద్యార్థులు ఇచ్చినవి, అధికారులు స్వాధీనం చేసుకున్నవి మొత్తం రెండు వందల కిలోల చిట్టీలు అయ్యాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
Gujarathjunaghar

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more