నాగ్ .. నాని మల్టీ స్టారర్ రీమేక్ కాదు: శ్రీరామ్ ఆదిత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్ .. నాని మల్టీ స్టారర్ రీమేక్ కాదు: శ్రీరామ్ ఆదిత్య

  • మల్టీ స్టారర్ ప్రాజక్టు చేస్తున్న శ్రీరామ్ ఆదిత్య 
  • హీరోలుగా నాగ్ .. నాని 
  • కథానాయికలుగా ఆకాంక్ష సింగ్ .. రష్మిక మందన
మొదటి నుంచి కూడా నాగార్జున కొత్తదనంతో కూడిన కథలను చేస్తూ వచ్చారు. మల్టీ స్టారర్ మూవీలు చేయడంలోనూ ఆయన ముందుంటూ వచ్చారు. ఇక నాని విషయానికొస్తే అన్నివర్గాల ప్రేక్షకులతో పక్కింటి అబ్బాయి అనిపించుకుని నేచురల్ స్టార్ గా మార్కులు కొట్టేశాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ ను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్నాడు.వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాలీవుడ్ మూవీ 'జానీ గద్దర్' కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో 2007లో ఈ హిందీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా నిర్మితమవుతోందనే టాక్ బలపడుతుండటంతో శ్రీరామ్ ఆదిత్య ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాకీ ఇది రీమేక్ కాదనీ, ఈ కథను ప్రత్యేకంగా తాము తయారు చేసుకున్నామని స్పష్టం చేశాడు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటిస్తోన్న సంగతి తెలిసిందే.    
Nagarjuna
nani
rashmika
akanksha

More Telugu News