మయన్మార్‌లో హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు

23-05-2018 Wed 08:47 | International
  • 53 మంది హిందువుల ఊచకోత
  • మృతుల్లో అత్యధికులు చిన్నారులే
  • తాజా నివేదికలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడి
మయన్మార్‌లోని రఖినెలో గతేడాది రోహింగ్యా ముస్లింలు హిందువులు నివసించే గ్రామాలపై పడి ఊచకోతకు పాల్పడినట్టు తాజాగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. గతేడాది ఆగస్టు 25న ఈ దారుణం జరిగిందని తాజా నివేదికలో పేర్కొంది. అదే రోజు రోహింగ్యా తిరుగుబాటుదారులు పోలీసు పోస్టులపై దాడులకు తెగబడ్డారని, దీంతో రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని పేర్కొంది.

రోహింగ్యాల దాడులతో మిలటరీ రంగంలోకి దిగడంతో తట్టుకోలేక  దాదాపు 7 లక్షల మంది రోహింగ్యాలు దేశం విడిచిపెట్టి సరిహద్దు దేశాలకు పారిపోయారు. ఆర్మీ చర్య రోహింగ్యా జాతి ప్రక్షాళనకు కారణమైందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

తమపై జరుగుతున్న దాడులకు ఆగ్రహంతో ఊగిపోయిన రోహింగ్యాలు హిందువులు నివసిస్తున్న ఉత్తర రఖినెలోని గ్రామాలపై దాడులు చేసి వారిని ఊచకోత కోశారని అమ్నెస్టీ వెల్లడించింది. హిందువులు ఊచకోతకు గురైన ప్రాంతానికి గతేడాది సెప్టెంబరులో రిపోర్టర్లను తీసుకెళ్లిన మిలటరీ.. రోహింగ్యాల దుశ్చర్యను ప్రపంచానికి చూపించింది. అయితే, అది తమ పని కాదని అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఆర్ఎస్ఏ) అప్పట్లో ప్రకటించింది.

తాజాగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ నివేదిక విడుదల చేస్తూ.. 53 మంది హిందువులను రోహింగ్యాలు ఊచకోత కోశారని వెల్లడించింది. ఉత్తర మౌంగ్‌డాలోని ఖా మౌంగ్ సేక్ గ్రామంలో ఈ దారుణం జరిగిందని, చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని వివరించింది. తమ తాజా దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూసినట్టు నివేదికలో పేర్కొంది.
RohingyamassacredHindusMyanmar

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more