ఈ కొబ్బరి బోండం మన పలాసది.. బండిలో పెట్టండి.. దారిలో తాగుతా!: పవన్ కల్యాణ్

22-05-2018 Tue 19:23 | Andhra
  • పలాస సభలో పవన్ కు కొబ్బరిబోండమిచ్చిన అభిమానులు
  • విదేశీ పానీయాలు ఏం దాహం తీర్చుతాయి!
  • ఇది కదా దాహం తీర్చేది: పవన్
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన ఈ కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఆ వేదిక వద్ద ఉన్న అభిమానులు పవన్ కు కొబ్బరిబోండం అందజేసి తాగాల్సిందిగా కోరారు. దీంతో, ఆ కొబ్బరిబోండం అందుకున్న పవన్, ‘ఈ కొబ్బరిబోండం మన పలాసది. విదేశీ పానీయాలు ఏం దాహం తీర్చుతాయి! ఇది కదా దాహం తీర్చేది. మన కొబ్బరినీళ్లు..మన పలాస బోండం తీరుస్తుంది దాహం..బండిలో పెట్టండి.. దారిలో తాగుతాను’ అంటూ ఆ బోండాన్ని తన సహచరులకు అందజేశారు. అయితే, ఈలోగా, మరొక కొబ్బరిబోండాన్ని పవన్ కు ఇవ్వడంతో ఆ కొబ్బరినీళ్లు తాగారు. 
Pawan Kalyanpalasa

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more