Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలికి గాయమైనా చిరంజీవి లెక్కచేయలేదు: సీనియర్ హీరోయిన్ నళిని

  • చిరంజీవితో రెండు సినిమాలు చేశాను 
  • 'సంఘర్షణ'లో మాపై డిస్కో సాంగ్ వుంది 
  • అప్పుడు ఆయన కాలుకు గాయమైంది
తమిళ .. మలయాళ .. కన్నడ భాషలతో పాటు తెలుగులోను నళిని కొన్ని సినిమాలు చేశారు. చిరంజీవితోను ఆమె రెండు సినిమాల్లో జోడీ కట్టారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు.

 " చిరంజీవితో నేను 'ఇంటిగుట్టు' .. 'సంఘర్షణ' సినిమాలు చేశాను. 'సంఘర్షణ' సినిమాకి సంబంధించి ఒక డిస్కో సాంగ్ షూటింగు జరుగుతోంది. అప్పుడు అనుకోకుండా ఒక మిర్రర్ పగిలిపోయి చిరంజీవి కాలికి గాయమై రక్తం కారుతోంది. చిరంజీవి చాలా బాధపడుతూ ఉండటంతో, షూటింగ్ కేన్సిల్ చేద్దామని దర్శక నిర్మాతలు అన్నారు. అయినా ఆయన వినిపించుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని మళ్లీ షూటింగులో పాల్గొన్నారు. అది చూసి ఆర్టిస్ట్ కి అంతటి అంకితభావం వుండాలని నాతో మా అమ్మ చెప్పింది. అలా చిరంజీవి గారిని చూసిన తరువాత నాలో అంకిత భావం మరింత పెరిగింది" అని చెప్పుకొచ్చారు.   
nalini
Chiranjeevi

More Telugu News