నెక్స్ట్ మూవీ విషయంలో ఆలోచనలో పడిన రామ్ ?

  • ప్రవీణ్ సత్తారుతో రామ్ మూవీ 
  • నిర్మాతగా స్రవంతి రవికిశోర్ 
  • బడ్జెట్ విషయంలో తర్జన భర్జనలు             
కొంతకాలంగా రామ్ కి సరైన హిట్ లేదు .. దాంతో ఆయన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరగవలసి వుంది. ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిన భవ్య క్రియేషన్స్ వారు, తాము అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువవుతుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారు.

దాంతో స్రవంతి మూవీస్ బ్యానర్ వారు తామే ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్లకి కూడా బడ్జెట్ విషయంలో సందేహాలు మొదలైనట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో రవి కిషోర్ తో పాటు రామ్ కూడా ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననేది ఆసక్తికరంగా మారింది  
Go Back to Shorts
ram
praveen

More Telugu News