మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్!
- గ్రూప్ వీడియో కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్
- ఆండ్రాయిడ్ వినియోగదారులు 2.18.145 వెర్షన్ కి అప్డేట్ చేసుకోవాలి
- ఐఓఎస్ వినియోగదారులు 2.18.52 వెర్షన్ కి అప్డేట్ చేసుకోవాలి
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్లలో 2.18.145 వెర్షన్ వాడుతున్న వినియోగదారులు గ్రూప్ వీడియో కాల్ చేసుకొనే వెసులుబాటు ఉంది. అలాగే ఐఓఎస్‌లో గ్రూప్ వీడియో కాల్ చేసుకోవాలంటే 2.18.52 వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలి. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతానికి కొంతమంది వినియోగదారులకు మాత్రమే లభిస్తుండగా అతి త్వరలోనే ప్రతి వినియోగదారుడికి అందుబాటులోకి రానుంది.