చంద్రబాబుకు కర్ణాటక రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: సోము వీర్రాజు ఆగ్రహం

  • అప్పట్లో ప్రజలు ఎన్టీఆర్‌కు పట్టం కట్టారు
  • చంద్రబాబు పార్టీని, ప్రభుత్వాన్ని చీల్చారు
  • ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది
బీజేపీ పదే పదే తప్పులు చేస్తోందని, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదని కర్ణాటక రాజకీయాలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని, కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు.

బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలను కర్ణాటక పంపించారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రజలు ఎన్టీఆర్‌కు పట్టం కడితే, చంద్రబాబు పార్టీని, ప్రభుత్వాన్ని చీల్చారని అన్నారు. ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రధాని మోదీని విమర్శించడంపై పెట్టారని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
somu veerraju
Andhra Pradesh

More Telugu News