బాలికపై యువకుడి అత్యాచారయత్నం.. పాత గుంటూరులో ఉద్రిక్తత!

  • నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిందితుడిని అప్పగించాలంటూ బాలిక బంధువుల ఆందోళన
  • పోలీస్ స్టేషన్ పై రాళ్లదాడి  
స్థానిక పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిని తమకు అప్పగించాలంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ విషయమై పోలీసులు ఎంతకీ స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్ పై వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉండటంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఆరా తీస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులతో ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు గుంటూరు నగరంలో 144 సెక్షన్ విధించినట్టు సమాచారం.
Go Back to Shorts
Guntur District
misbehaviour

More Telugu News