కాంగ్రెస్ ఆశలపై నీళ్లు... అతిపెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ!
- 107 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
- బెంగళూరులో మినహా మరెక్కడా ప్రభావం చూపని కాంగ్రెస్
- సంబరాలు ప్రారంభించిన బీజేపీ నేతలు
జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆ పార్టీ చేరుతుందని అంచనా. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమై ట్రెండ్స్ వెలువడుతుండగా, బీజేపీ 107 చోట్ల, కాంగ్రెస్ 71 చోట్ల, జేడీఎస్ 42 చోట్ల, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నాయన్న ఆనందంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు ప్రారంభించారు.