అల్లు అర్జున్ అంకితభావమే ఆయనను స్టార్ ను చేసింది: వక్కంతం వంశీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్ అంకితభావమే ఆయనను స్టార్ ను చేసింది: వక్కంతం వంశీ

  • అల్లు అర్జున్ డైలాగ్స్ ను ప్రాక్టీస్ చేస్తాడు 
  • డాన్స్ విషయంలో మరింత ప్రాక్టీస్ ఉంటుంది 
  • ఆయన హార్డ్ వర్క్ ను ప్రత్యక్షంగా చూశాను  
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో వక్కంతం వంశీ మాట్లాడాడు.

"అల్లు అర్జున్ తాను చేయబోయే సీన్ కి సంబంధించిన డైలాగ్స్ ను ముందే అడుగుతాడు. ఒక వైపున షూటింగ్ జరుగుతూ ఉంటే .. మరో వైపున ఒంటరిగా ఒక చోట కూర్చుని తన డైలాగ్స్ ను ప్రాక్టీస్ చేస్తుంటాడు. డైలాగ్స్ విషయంలోనే కాదు .. డాన్స్ విషయంలోను ఆయన రిహార్సల్స్ చేస్తాడు.

సాంగ్ షూటింగుకి రెండు మూడు రోజుల ముందే స్టెప్స్ కంపోజ్ అయ్యేలా చూసుకుంటాడు .. అప్పటి నుంచి షూటింగ్ వరకూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. రిహార్సల్స్ లేకుండా ఆయన సాంగ్ షూట్ పెట్టనివ్వడు. ఆయన హార్డ్ వర్క్ చూసిన తరువాతనే స్టార్ హీరో ఎలా అయ్యాడో అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.      
allu arjun
anu emmanuel

More Telugu News