పాట్నాలో హత్యకు గురైన ఆర్జేడీ నాయకుడు!

  • బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా సంఘటన
  • దీనా గోపేపై గుర్తుతెలియని వ్యక్తులు ఏకే 47తో కాల్పులు
  • ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు
బీహార్ లోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు దీనా గోపే హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపిన సంఘటన పాట్నాలో ఈరోజు ఉదయం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకకు దీనా గోపే హాజరయ్యారు.

 ఈ వేడుక నుంచి తిరిగి బయలుదేరిన ఆయన, అనూషాబాద్ లోని తన ఇంటికి సమీపంలోకి రాగా గుర్తుతెలియని వ్యక్తులు ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డ అనంతరం పారిపోయారని చెెప్పారు. కాగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం ఈరోజు సాయంత్రం జరగనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వీవీఐపీలు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పాట్నాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంత భద్రత ఉన్న తరుణంలో ఈ హత్య జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Go Back to Shorts
patna
rjd
deena gope

More Telugu News