అసలు కులం గురించి అడగడం ఏంటీ?: వర్ల రామయ్యపై వైసీపీ ఎంపీ వరప్రసాద్ మండిపాటు
- వర్ల రామయ్య పిల్లలు ఫోన్లు వాడరా?
- పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా?
- తన స్థాయిని మరచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ?
వర్ల రామయ్య పిల్లలు ఫోన్లు వాడరా? అని ప్రశ్నిస్తూ... పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అని వరప్రసాద్ నిలదీశారు. ఇలా కులం గురించి అడగటం ఏంటని, తన స్థాయిని మరచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పక్కనున్న టీడీపీ నాయకులు వర్ల రామయ్యను ఇంకాస్త రెచ్చగొట్టారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా దళితులను ఉద్దేశించి దారుణంగా మాట్లాడి, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని అన్నారు.