బోటులో అగ్నిప్రమాదంపై ఆరాతీసిన చంద్రబాబు
- తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుతో మాట్లాడిన చంద్రబాబు
- ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటూ ఆదేశం
- యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలంటూ ఆదేశాలు
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద టూరిస్ట్ బోటులో మంటలు రేగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో బోటులో 90 మంది ప్రయాణికులు ఉన్నారు. పాపికొండలుకు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.