ఢిల్లీ వాసులను వణికించిన భూప్రకంపనలు
- ఆఫ్ఘనిస్థాన్ లో 6.2 తీవ్రతతో భూకంపం
- కాసేపటి తర్వాత నార్త్ ఇండియాలో పలు చోట్ల ప్రకంపనలు
- ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులుతీసిన జనం
ప్రకంపనల నేపథ్యంలో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సాయంత్రం 4.15 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. మరోవైపు, యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుల్లో 111.9 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.