ఈ సారి బతుకమ్మ చీరల పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు చర్యలు

08-05-2018 Tue 18:33 | Telangana
  • టెక్స్ టైల్స్ శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
  • అన్ని చీరలు రాష్ట్రంలోనే ఉత్పత్తి 
  • సెప్టెంబర్ మూడో వారంలోగా అన్ని చీరలు పంపిణీకి సిద్ధం
  • చీరల క్వాలీటీ, డిజైన్ల ఎంపిక పూర్తి
తెలంగాణలో టెక్స్ టైల్స్ శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ ఐఐసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుండ్ల పోచంపల్లి, పాశ మైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.

గతంలో ఒకసారి గుండ్ల పోచంపల్లి పార్కులో పర్యటించి, అప్పారెల్ తో సంబంధం లేకుండా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి అనుమతులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చిన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పార్కులో తెలంగాణలో ఉన్న వివిధ హ్యాండిక్రాప్ట్ కళాకారులకు శిక్షణ ఇచ్చేలా ఒక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గుండ్ల పోచంపల్లిలో అవసరం అయిన మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని, పార్కు నిర్వహణ కోసం అవసరం అయిన కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.

పాశ మైలారం టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అక్కడ అవసరం అయిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని టిఎస్‌ ఐఐసీ అధికారులకు మంత్రి అదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు వివిధ వర్గాల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని, ఈ దిశగా టెస్కో ద్వారా మరిన్ని అమ్మకాలు పెంచేలా, ప్రజలకు చేనేత వస్త్రాలు మరింతగా అందుబాటులో ఉండేలా చేసేందుకు నూతనంగా టెస్కో వెబ్ సైట్ ఏర్పాటు, టెస్కో కేంద్రాల పెంచడం, రీ బ్రాండింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

టెక్స్ టైల్ శాఖ ద్వారా చేపడుతోన్న నేతన్నకు చేయూత, చేనేత మిత్రా, లూమ్స్ అప్ గ్రేడేషన్ వంటి కార్యక్రమాలపైన కూడా కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలను మరింతగా లబ్దిదారుల్లోకి తీసుకుని వెళ్లేందుకు అవసరం అయితే కమ్యూనిటీ కోఅర్డినేటర్లను కొంత మందిని నియమించుకోవాలని అదేశాలు జారీ చేశారు.

బతుకమ్మ చీరలు..

ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మొత్తం చీరలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు, సెప్టెంబర్ మూడో వారంలోగా అన్ని చీరలు పంపిణీకి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఇప్పటికే ఈ చీరల డిజైన్లు, క్వాలీటీ ఎంపికపైన సెర్ఫ్ మహిళా సంఘాలతో చర్చించి పలు డిజైన్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక వసతులు పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లాలోని అప్పారెల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ల కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు.                      
sareesKTRTelangana

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more