ఐపీఎల్ లో బెస్ట్ టీమ్ హైదరాబాదేనా? అని అడిగితే తెలివిగా సమాధానమిచ్చిన విరాట్ కోహ్లీ!
- పది మ్యాచ్ లు ఆడి ఎనిమిది గెలిచిన సన్ రైజర్స్
- బౌలింగ్ పరంగా అత్యుత్తమ జట్టు
- ఆల్ రౌండ్ ప్రతిభ మాత్రం సన్ రైజర్స్ దే
బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ టీమ్ ఉత్తమమైనదేనని అంటూనే, బ్యాటింగ్ లోపాలను ఎత్తి చూపాడు. హైదరాబాద్ జట్టును గెలిపిస్తున్నది బౌలర్లేనని, వాళ్లకున్న బలం అదేనని, తమ బలమేంటన్నది వారికి తెలుసునని చెప్పాడు. ఆల్ రౌండ్ ప్రతిభ విషయంలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అత్యుత్తమ టీమని చెప్పాడు.