కర్ణాటక ఎన్నికల ప్రచారం: మోదీ - అమిత్ షా, సోనియా- రాహుల్ సభలు!

08-05-2018 Tue 07:33 | National
  • ఈరోజు బెంగళూరులో ర్యాలీ..  పాల్గొననున్న మోదీ
  • బీజాపూర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్న సోనియాగాంధీ
  • బెంగళూరు అర్బన్ ఓటర్లతో సమావేశం కానున్న రాహుల్ గాంధీ
కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇక కొన్ని రోజులే సమయం ఉండటంతో, జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారం జోరును పెంచాయి. కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ప్రధాని మోదీ ఈరోజు బెంగళూరులో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం నేషనల్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

బెంగళూరు సిటీలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను ఈ వేదిక నుంచి మోదీ పరిచయం చేస్తారు. కర్ణాటకలోని కొప్పుల, విజయపురలలో కూడా మోదీ ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కొడగు, మడికేరిలలో నిర్వహించే రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. బెంగళూరు అర్బన్ లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. యూపీ సీఎం ఆదిత్యానాథ్ కూడా మంగళూరులో నిర్వహించే ప్రచారంలో పాల్గొననున్నారు.

కాగా, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాల్గొననున్నారు. బీజాపూర్ లో నిర్వహించే ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు.
బెంగళూరు అర్బన్ ఓటర్లతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. అనంతరం, చిక్ బళ్లాపూర్, తుముకూరులో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 
KarnatakamodisoniaRahul Gandhi

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more