కర్ణాటక కోసం రంగంలోకి దిగిన సోనియా!

06-05-2018 Sun 08:11 | Both States
  • అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని చెబుతున్న సర్వేలు
  • అధికారాన్ని ఖాయం చేసుకునేందుకు సోనియాతో ప్రచారం
  • 8న బీజాపూర్ లో ర్యాలీ, బహిరంగ సభ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అయితే, మెజారిటీకి కొంత దూరంలో ఆగుతుందని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, గెలుపును ఖాయం చేసేందుకు సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమె, 8వ తేదీ నుంచి కర్ణాటకలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నుంచి పెద్ద నేతల్లో రాహుల్ గాంధీ మాత్రమే ఇప్పటివరకూ అన్నీ తానై ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

గత రెండు నెలలుగా ఆయన పలుమార్లు కర్ణాటకలో పర్యటించి, తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ ఆయన చుట్టిరావడం గమనార్హం. ఇక సోనియా 8న బీజాపూర్ లో జరిగే ఎన్నికల ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన తరువాత, ఓ ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవలి పార్టీ అంతర్గత సర్వేలో మరోసారి అధికారం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడి కావడంతో, దాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాను కూడా వస్తానని సోనియా స్వయంగా వ్యాఖ్యానించడంతోనే ఆమె పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
Sonia GandhiRahul GandhiKarnatakaAssembly Elections

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more