సారీ.. మేము దానికి అంగీకరించలేం: ఆఫ్ఘనిస్థాన్ కు స్పష్టం చేసిన బీసీసీఐ
- షార్జాలో టీ20 లీగ్ నిర్వహించనున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు
- ఆటగాళ్లను పంపాలంటూ బీసీసీఐకి విన్నపం
- వేరే లీగ్ లలో మా ఆటగాళ్లు ఆడరని చెప్పిన బీసీసీఐ
తమ ఆటగాళ్లు ఐపీఎల్ లో తప్ప మరే ఇతర టీ20 లీగ్ లోనూ ఆడటం లేదని ఏసీబీకి బీసీసీఐ తెలిపింది. మీ లీగ్ లో ఆడేందుకు అనుమతిస్తే... ఇతర దేశాలు కూడా అడుగుతాయని... దానికి తాము సిద్ధంగా లేమని చెప్పింది. ఒక్క ఆటగాడిని అనుమతించినా... అందరినీ అనుమతించాల్సి వస్తుందని తెలిపింది. బీసీసీఐ కాంట్రాక్టులో లేని ఆటగాళ్లనైనా పంపాలని ఏసీబీ కోరగా... బీసీసీఐ దానికి కూడా అనుమతించలేదు. మీ లీగ్ కు ఆటగాళ్లను పంపకపోయినా... ఏసీబీకి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.