సెట్ లోనే కేక్ కట్ చేసిన సమంత

  • 'రంగస్థలం'తో హిట్ కొట్టిన సమంత 
  • 'మహానటి'తో త్వరలో ఆడియన్స్ ముందుకు 
  • షూటింగు దశలో 'యు టర్న్'
'రంగస్థలం' సినిమా హిట్ కావడం .. 'రామలక్ష్మి' పాత్రకి మంచిపేరు రావడం సమంతకి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'మహానటి' కూడా తనకి మరింత మంచి పేరు తెస్తుందని ఆమె భావిస్తోంది. ఈ క్రమంలో ఆమె 'యు టర్న్' సినిమా చేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. దాంతో ఈ సినిమా సెట్ లోనే ఆమె కేక్ కట్ చేసింది. ఈ సినిమా యూనిట్ సభ్యులంతా సమంతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టిన రోజున బ్రేక్ తీసుకోకుండా షూటింగులో పాల్గొంటూ .. అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. కన్నడ మూవీకి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది. 
Go Back to Shorts
samanta
aadi penishetti

More Telugu News