ఎన్టీఆర్ బయోపిక్ పై వైరల్ అవుతోన్న కొత్త పుకారు!

28-04-2018 Sat 13:43 | Entertainment
  • ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తేజ
  • తెరపైకి పలువురు దర్శకుల పేర్లు
  • బాలయ్యే దర్శకత్వం వహించనున్నారంటూ కొత్త పుకారు
మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తాను నిర్మాతగా ఉంటూ... దర్శకత్వ బాధ్యతలను తేజకు అప్పగించారు. మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది అనుకుంటుండగా... దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్నారు.

దీంతో, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, వైవీయస్ చౌదరి, క్రిష్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పుడు కొత్త పుకారు ఒకటి వైరల్ అవుతోంది. బాలయ్యే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారనేదే ఆ పుకారు. ఈ వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.

ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందని బాలయ్య ఆలోచిస్తున్నారట. మెగా ఫోన్ పట్టుకోవాలని గతంలోనే బాలయ్య భావించారు. 'నర్తనశాల' సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే, ఆ సినిమాలో ద్రౌపదిగా అనుకున్న సౌందర్య చనిపోవడంతో... ఆ చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు 'ఎన్టీఆర్' చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని బాలయ్య అనుకుంటున్నారన్న వార్తలో ఎంత వరకు నిజం ఉందో రానున్న రోజుల్లో తేలిపోనుంది.
ntrbiopicBalakrishnadirections

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more