అత్యంత దారుణం.. మదర్సాలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు!

  • పదేళ్ల బాలికపై టీనేజర్, మౌల్వి అత్యాచారం
  • ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన
  • టీనేజర్ జువైనల్ హోమ్ కు తరలింపు
ఉన్నావో, కథువా ఘటనలను మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో సభ్యసమాజం తలదించుకునేలా మరో దారుణం జరిగింది. ఘజియాబాద్ లో పదేళ్ల బాలికను మదర్సాలోకి తీసుకెళ్లి, అత్యాచారం జరిపారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 21వ తేదీన సదరు బాధిత బాలిక ఏదో కొనడానికి షాపుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు.

దీంతో ఏదో జరిగి ఉంటుందని భావించిన ఆమె తండ్రి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక వద్ద ఉన్న ఫోన్ కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అయితే ఫోన్ ఏ లొకేషన్ లో ఉందో పసిగట్టిన పోలీసులు... 22వ తేదీన మదర్సాపై మెరుపు దాడి చేశారు. అక్కడ బాలికను ఓ చాపలో చుట్టి ఉంచారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఒక టీనేజ్ యువకుడితో పాటు, మౌల్వి, మరో ఇద్దరు అక్కడే ఉన్నారు.

టీనేజరే తనను మదర్సాలోకి లాక్కెళ్లాడని మేజిస్ట్రేట్ ముందు బాధిత బాలిక తెలిపింది. తన స్నేహితురాలిని కలుసుకునేందుకు తాను వెళ్లగా... ఆమె అన్న తన వద్దకు వచ్చి తన సోదరి వద్దకు తీసుకెళతానని చెప్పి, మదర్సాలోకి లాక్కెళ్లాడని చెప్పింది. టీనేజర్ తో పాటు మౌల్వి కూడా తనపై అత్యాచారం చేశాడని బాధిత బాలిక తనతో చెప్పిందని ఆమె మేనమామ ఆరోపించారు.

ఈ కేసులో కీలక నిందితుడైన 17 ఏళ్ల టీనేజర్ ను అరెస్ట్ చేసి, జువైనల్ హోమ్ కు తరలించారు. అయితే మౌల్వీని కూడా అరెస్ట్ చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం మతం రంగు కూడా పులుముకుంది. మౌల్వీని అరెస్ట్ చేయాలంటూ హిందుత్వ సంఘాల ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 
Go Back to Shorts
rape
girl
teenager
Uttar Pradesh
ghaziabad

More Telugu News