పెరుగుతోన్న అవకాశాలు .. పారితోషికం పెంచేసిన అదితీరావు
- విడుదలకి సిద్ధంగా 'సమ్మోహనం'
- వరుణ్ తేజ్ తో త్వరలో సెట్స్ పైకి
- అందుబాటులో మరిన్ని అవకాశాలు
ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ జోడీగా కనిపించనుంది. ఇక కొంతమంది సీనియర్ హీరోల తదుపరి చిత్రాల కోసం కూడా అదితీరావునే సంప్రదిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె పారితోషికం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి సినిమాకి 50 లక్షలు తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. సరైన హిట్ పడితే ఈ పారితోషికం రెట్టింపు కావడం ఖాయమనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.