మీ అపాయింట్ మెంట్ కావాలి సార్: కేటీఆర్ ను మరోసారి అడిగిన నటి శ్రీరెడ్డి

  • దయచేసి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి
  • అమ్మాయిల దుస్థితిపై మౌనంగా ఎందుకున్నారు?
  • మహిళా సాధికారత ఎక్కడుంది?
  • కేటీఆర్ కు చేరిన ట్వీట్
బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై, మహిళా నటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి, తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కావాలని మరోసారి కోరింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "దయచేసి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి సార్. తెలుగు చిత్ర పరిశ్రమలో సెక్సువల్ హెరాస్ మెంట్ పై, అమ్మాయిల దుస్థితిపై మీరు మౌనంగా ఎందుకున్నారు?

మహిళా సాధికారత గురించి ఎన్నో విషయాలను మీరు మాట్లాడుతుంటారు. చాలినంత రక్షణ లేకుంటే మహిళా సాధికారత ఎక్కడుంటుంది. ప్లీజ్ సార్... మీ అపాయింట్ మెంట్ కావాలి" అని రాత్రి 11:21 గంటలకు కేటీఆర్ కు పెట్టిన వాట్స్ యాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది శ్రీరెడ్డి.  
Go Back to Shorts
Tollywood
Casting Couch
Sri Reddy
KTR

More Telugu News