'రంగస్థలం'లో లేని రంగమ్మత్త సీన్... ఆడిషన్ వీడియోను పోస్టు చేసిన అనసూయ!

26-04-2018 Thu 12:05 | Entertainment
  • సూపర్ హిట్ అయిన 'రంగస్థలం'
  • రంగమ్మత్త పాత్రలో జీవించిన అనసూయ
  • ఆడిషన్ లోనూ ఇరగదీసిన అనసూయ
రెండు వారాల క్రితం విడుదలై సూపర్ హిట్ అయిన 'రంగస్థలం' సినిమాలో లేని రంగమ్మత్తకు సంబంధించిన ఓ సీన్ ను ఆడిషన్స్ లో భాగంగా అనసూయపై చిత్రీకరించగా, తాజాగా ఆ వీడియోను అనసూయ తన అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో అనసూయ పాత్రకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. పల్లెటూరి మహిళగా అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఇక ఈ వీడియోలో పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ లో కనిపిస్తుండగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య జరిగిన ఓ సీన్ ఇది. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది? ఈ పాటికి మీ మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు... అయినా నేను లేనా ఏంటి? అన్న డైలాగులు ఉన్నాయి.

ఈ సీన్ సినిమాలో లేనప్పటికీ, ఉంటే బాగుండుననిపించేలా ఉంది. ఆడిషన్ లో భాగంగా సీన్ తీసినప్పటికీ, అందులోనూ అనసూయ ఇరగదీసిందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.
RangasthalamAnasuyaRangammattaAuditions

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more