తీర్పు విన్న తర్వాత 'ఏదైనా చేయండి' అని వేడుకున్న ఆశారాం బాపు!
- తన వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గిస్తారని భావించిన ఆశారాం
- తీర్పు వినగానే గుండె బద్ధలు
- ఏదైనా చేయాలని న్యాయవాదులకు వేడుకోలు
"తీర్పు విన్న తరువాత ఆయన హృదయం బద్దలైనట్టు కనిపించింది. పైకోర్టుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. 77 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన పదే పదే తన న్యాయవాదులతో 'ఏదైనా చేయండి' అని వేడుకుంటూ కనిపించారు" అని జైలు వర్గాలు వెల్లడించాయి. కాగా 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ఐదేళ్ల విచారణ అనంతరం కోర్టు ఆయనకు నిన్న జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.