Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అల్లరి’ సుభాషిణికి చిరంజీవి సాయం!

  • కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుభాషిణి
  • సుభాషిణి ఇంటికి వెళ్లిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ
  • రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేత
కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటాలీవుడ్ సీనియర్ నటి సుభాషిణికి అగ్రహీరో చిరంజీవి సాయం అందించారు. సుభాషిణి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. సుభాషిణి ఇంటికి చిరంజీవి చిన్నకూతురు శ్రీజ ఈరోజు వెళ్లారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుకున్న శ్రీజ, రూ.2 లక్షలు అందజేశారు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా,‘అల్లరి’, ‘శ్రీ ఆంజనేయం’, ‘కితకితలు’, నచ్చావులే’, ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’, ‘అమరావతి’, ‘మనీ మనీ, మోర్ మనీ’, ‘సుడిగాడు’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘గుంటూరు టాకీస్’ తదితర చిత్రాల్లో సుభాషిణి నటించారు. 
Tollywood
mega star chiranjeevi

More Telugu News