సెంచరీ వీరుడు క్రిస్ గేల్ ను కొనియాడిన షేన్ వాట్సన్
- ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బ్యాట్స్ మ్యాన్
- మరెన్నో టి20 సెంచరీలు సాధించగలడు
- అందుకే అతన్ని యూనివర్స్ బాస్ అనేది
‘‘క్రిస్ గేల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బ్యాట్స్ మ్యాన్. మరెన్నో టి20 సెంచరీలు సాధించగలడు. అందుకే అతన్ని యూనివర్స్ బాస్ అనేది’’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ గేల్ ను మెచ్చుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో గేల్, వాట్సన్ ఇద్దరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లు. ఇక ఎంఎస్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను కూడా షేన్ వాట్సన్ మెచ్చుకున్నాడు. వారిద్దరూ కలసి సామర్థ్యం మేరకు రాణించే ఆటగాళ్లతో మంచి జట్టు (చెన్నై సూపర్ కింగ్స్) కూర్పును రూపొందించారని అన్నాడు.