'చంద్రబాబు మా దేవుడు' అంటూ గుడి కడుతున్న హిజ్రాలు!

  • హిజ్రాలకు నెలకు రూ. 1500 పింఛన్ 
  • సంతోషంతో గుడి కడుతున్న హిజ్రాలు
  • ఘనంగా భూమి పూజ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ పాలిట దైవం అంటూ ఆయనకు గుడి కట్టేందుకు హిజ్రాలు సన్నద్ధమయ్యారు.  సమతా హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్మించనున్న గుడికి భూమి పూజ నిర్వహించారు. చంద్రబాబు జన్మదినమైన శుక్రవారం ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నెలకు రూ.1500 పింఛన్ అందించాలన్న చంద్రబాబు నిర్ణయంతో తమలో మానసిక స్థైర్యం మరింత పెరిగిందని ఈ సందర్భంగా హిజ్రాల సంఘం గౌరవాధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు.

గుడిలో ప్రతిష్ఠించబోయే చంద్రబాబు వెండి విగ్రహం కోసం రూ.5 లక్షలు విరాళం ఇస్తున్నట్టు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అభిరుచి మధు ప్రకటించారు. గుడి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని విజయ్ కుమార్ తెలిపారు. చంద్రబాబు గుడి భూమి పూజ కార్యక్రమానికి మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Go Back to Shorts
Chandrababu
temple
Nandyal
Andhra Pradesh

More Telugu News