టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది: డీకే అరుణ
- తెలంగాణ సీఎం తన పదవికి రాజీనామా చేయాలి
- టీఆర్ఎస్ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోంది
- కేసీఆర్‌కి హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసింది
- కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు
టీఆర్ఎస్ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని, అసెంబ్లీలో తమకు ఇష్టం ఉన్న వారినే లోపలికి రానిస్తామనేలా వ్యవహరిస్తోందని డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు కొట్టిందని, అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదని ఆమె అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.