కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయమై... సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రఘువీరారెడ్డి

15-04-2018 Sun 13:34 | Andhra
  • జి.ఓ.నెం.27 ను రద్దు చేయాలి
  • కోర్టు తీర్పును గౌరవిస్తారని ఆశిస్తున్నా
  • వైద్య ఆరోగ్య శాఖలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం కోరుతున్న జి.ఓ.నెం.27 రద్దు చేయాలని, వారి డిమాండ్లు నెరవేర్చాలని ఈ లేఖలో కోరారు.

‘కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా ఉన్న 2018 మార్చి 16వ తేదీన మీ ప్రభుత్వం తెచ్చిన జి.ఓ.నెం.27 ను సవరించి, 'కన్సాలిడేటెడ్ పే' అనే విధానం రద్దు చేయాలని 21 వేల మంది  ప్రజారోగ్య వైద్య ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వారి డిమాండు ఎంతో సమంజసమైనది. ఒకే పనికి ఒకే వేతనం అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణమైనది. కోర్టు తీర్పునైనా గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఫీల్డ్ వర్క్ చేసే పారా మెడికల్ ఉద్యోగులకు బయో మెట్రిక్ పద్ధతిని అమలు చేయడం ఎంత హాస్యాస్పదమో, అది వారి దైనందిన పనిని ఎలా ఆటంక పరుస్తుందో కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి మీకు, మీ ప్రభుత్వానికి ఎందుకు తెలియటం లేదో! వారు కోరుతున్న విధంగా ఆ విధానాన్ని వెంటనే నిలిపి వేయాలి’

‘ప్రజారోగ్య పనులు కుంటుపడే విధంగా వారిని ఇతర పనులకు, తమరి ప్రచార కార్యక్రమాలకు వినియోగించటం దారుణం. తక్షణమే నిలిపి వేయాలి. హైకోర్టు తీర్పును అనుసరించి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు విధానాన్ని తొలగించి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఈ మధ్య జరిగిన 84వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగుల, కార్మికుల దోపిడీని రద్దు చేస్తామని తీర్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రాధమిక వైద్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు సరిపడే స్థాయిలో మందుల సరఫరా చేయాలని వారు చేస్తున్న డిమాండు అభినందనీయం. వెంటనే దృష్టి సారించాలి. ఎంతో సమంజసమైన వారి డిమాండ్లను పరిష్కరించి ప్రజారోగ్యం పట్ల, ఉద్యోగుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఆశిస్తాను’ అని కోరారు.
Chandrababuraghuveera reddy

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more