అమ్మాయి అవకాశం కోసం వస్తే వాడుకోవాలనే చూస్తారు: నటి పూనమ్ కౌర్
- నాక్కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది
- పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుని బయటపడ్డా
- నేనేమీ బలహీనురాలిని కాను
తనకు ఓపిక అధికమని, ఎవరికీ నష్టం చేసే మనస్తత్వం తనకు లేదని చెప్పింది. తన చుట్టూ ఏం జరుగుతుందన్న సంగతి తనకు తెలుసునని, ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే, తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. తాను మాత్రం అంత బలహీనురాలిని కాదని, తాను చేయగలిగిందే చేస్తానని, భయపెట్టే వ్యక్తి ఏం చేయగలడో ఎదురు నిలబడి చూస్తానని ధైర్యంగా ఉండటం తనకెంతో ఇష్టమని చెప్పింది.