ఆర్సీబీతో మ్యాచ్ లో అభిమానులను ఆకట్టుకున్న అనుష్క ఫ్లైయింగ్ కిసెస్

  • భర్త నేతృత్వంలోని జట్టును ఉత్సాహపరచిన అనుష్క 
  • స్టాండ్స్ లో సందడి చేసిన అనుష్క శర్మ, ప్రీతి జింటా
  • కోహ్లీ క్యాచ్ పట్టగానే ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చిన అనుష్క
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, సినీ నటి అనుష్క శర్మ సందడి చేసింది. ఐపీఎల్‌ లో భాగంగా హోమ్‌ గ్రౌండ్‌ లో ఆడుతున్న బెంగళూరు జట్టును అనుష్క శర్మ ఉత్సాహ పరిచింది. మైదానంలో ఉన్న భర్త క్యాచ్ పట్టగానే గ్యాలరీ నుంచి ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చింది. కోహ్లీ, సర్ఫరాజ్ అవుటైన తరువాత టెన్షన్ పడింది. చివరికి మ్యాచ్ లో కోహ్లీ సేన విజయం సాధించడంతో అనుష్క సంతోషంగా కనబడింది. కాగా, ఇదే మ్యాచ్ మరో బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా కూడా సందడి చేసింది. 
Go Back to Shorts
Cricket
ipl
rcb
Anushka Sharma
Virat Kohli

More Telugu News