వైట్ హౌస్ ను ట్రంప్ మాఫియా డాన్ లా నిర్వహిస్తున్నారు: ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్ కోమీ

14-04-2018 Sat 09:52 | International
  • పుస్తకం రాస్తున్న ఎఫ్భీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ
  • ‘ఎ హైర్‌ లాయలిటీ: ట్రూత్‌, లైస్‌ అండ్‌ లీడర్‌షిప్‌’ పుస్తకంలో ట్రంప్ గురించి పలు అంశాలు
  • అధ్యక్షుడు వాస్తవానికి దూరంగా బతుకుతున్నారు 
వైట్ హౌస్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాఫియా డాన్ లా నడిపిస్తున్నారని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ తెలిపారు. 2017 మేలో ఎఫ్బీఐ నుంచి జేమ్స్‌ కోమీని ట్రంప్ తొలగించిన సంగతి తెలిసిందే. ‘ఎ హైర్‌ లాయలిటీ: ట్రూత్‌, లైస్‌ అండ్‌ లీడర్‌ షిప్‌’ పేరిట ఆయన పుస్తకం రాస్తున్నారు. ఈ పుస్తకం వచ్చే మంగళవారం విడుదల కావాల్సి ఉండగా, ఇందులోని వివిధ విషయాలు లీకై అమెరికా మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ పుస్తకంలో.. అమెరికా అధ్యక్షుడు వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని కోమీ పేర్కొన్నారు. ట్రంప్ తన చుట్టూ ఓ గూడును అల్లుకున్నారని, మిగతా వారిని కూడా అందులోకి లాగేందుకు ప్రయత్నిస్తుంటారని ఆయన ఆరోపించినట్టు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ట్రంప్‌ తనతో నిర్వహించిన సమావేశం తన కెరీర్‌ మొదట్లో జరిగిన మాఫియా విచారణ తరహాలో అనిపించిందని ఆయన పేర్కొన్నారు.

ఆయన చెప్పేవాటిని సమ్మతించేవారే ఆయన చుట్టూ ఉంటారని, దీంతో అన్నీ బాస్ అధీనంలోనే ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యక్షుడి చర్యలు అనైతికమని, సంస్థాగత విలువలను పట్టించుకోరని జేమ్స్ కోమీ తన పుస్తకంలో రాసుకునట్లు తెలుస్తోంది. ట్రంప్ నాయకత్వం అహం, అబద్ధాలు, వ్యక్తిగత విశ్వసనీయలతో నడుస్తోందంటూ ఆయన తన పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ పుస్తకంలో ట్రంప్ గురించి ఆయన ఇంకేం రాశారోనని ఆసక్తి పెరుగుతోంది.
USAwhite houseDonald Trumpjames comy

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more