సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అఖిల్ కి జోడీగా కన్నడ భామ 
  • చరణ్ సినిమాకి భలే డిమాండ్ 
  • పలు భాషల్లోకి 'ప్రియ' సినిమా 
*  అక్కినేని అఖిల్ సరసన 'చలో' ఫేం రష్మిక మండన కథానాయికగా నటించే అవకాశం కనిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన తాజా చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయిక పాత్రకు కన్నడ భామ రష్మికతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం ఘన విజయాన్ని అందుకుని బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక్క తమిళంలోకే కాకుండా, మలయాళం, హిందీ, భోజ్ పురి భాషల్లోకి కూడా అనువదించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  ఇటీవలి కాలంలో కొంటె కనుసైగలతో ఎంతగానో పాప్యులర్ అయిపోయిన మలయాళీ భామ ప్రియా వారియర్. ఆమె నటించిన తొలి  చిత్రం 'ఒరు ఆదార్ లవ్' లోని పాటలో ఆమె చూపిన హావభావాలు ఆమెను రాత్రికి రాత్రే స్టార్ ను చేసేశాయి. దీంతో ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేస్తున్నారు. మార్చ్ ఒకటిన విడుదల కావలసిన ఈ చిత్రం కారణాంతరాల వల్ల వాయిదా పడింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు.      
Go Back to Shorts
Rashmika
akhil
charan
priya

More Telugu News