ప్రత్యేక హోదా పోరాటానికి రెడీ అవుతున్న టాలీవుడ్.. అభినందించిన చంద్రబాబు
- విజయవాడలో టాలీవుడ్ ప్రముఖుల పాదయాత్ర
- ఢిల్లీలో టీవీ ఆర్టిస్టుల ధర్నా
- చంద్రబాబుకు తెలిపిన అంబికా కృష్ణ
ప్రత్యేక హోదా కోసం తెలుగు సినీ పరిశ్రమ చేయనున్న ఆందోళనకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేయడానికి తెలుగు టీవీ ఆర్టిస్టులు ముందుకు వచ్చారని... విజయవాడలో పాదయాత్ర చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర ప్రముఖులందరూ ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమను చంద్రబాబు అభినందించారు. పరిశ్రమ చేపట్టే ఆందోళనకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు.