హైదరాబాదులో ఈరోజు నుంచి 14 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

13-04-2018 Fri 08:35 | Andhra
  • ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ బస్టాండ్ వరకు మెట్రో పనులు
  • ట్రాఫిక్ ఆంక్షలను విధించిన పోలీసులు
  • నేటి నుంచి 26వ తేదీ వరకు ఆంక్షలు
ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాదులోని జూబ్లీ బస్టాండ్ వరకు జరుగుతున్న మెట్రో కారిడార్-2 పనుల్లో భాగంగా పిల్లర్ల నిర్మాణం చేపట్టనుండటంతో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్టు ఇన్ ఛార్జ్ పోలీస్ కమిషనర్ చౌహాన్ తెలిపారు. ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వెళ్లే దారిలో వాహనాలను మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాంతంలో పయనించే వారు కింది సూచనలను పాటించాలి.

  • ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్లేవారు ముషీరాబాద్ చౌరస్తా నుంచి కుడివైపు తిరగాలి. పద్మారావు నగర్ క్రాస్ రోడ్డు, చిలకలగూడ సర్కిల్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి. 
  • కుషాయిగూడ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్లేవారు... ముషీరాబాద్ చౌరస్తా నుంచి పద్మారావు నగర్, చిలకలగూడ క్రాస్ మీదుగా వెళ్లాలి.
  • సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాదు వెళ్లేవారు... యథావిధిగా అదే మార్గంలో పయనించవచ్చు.
  • కవాడిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లేవారు... మేకలమండి, బోయిగూడ టీ జంక్షన్, గాంధీ ఆసుపత్రి మీదుగా పయనించాలి.
  • ముషీరాబాద్ చౌరస్తాలో వాహనాలను పార్కింగ్ చేయరాదు.
hyderabadmetroworkstrafficrules

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more