ఒంగోలులో విషాదం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి
- నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా సంఘటన
- నిర్మాణంలో ఉన్న గోడ కూలి వీరిపై పడిన వైనం
- అక్కడికక్కడే మృతి చెందిన ఎనిమిదేళ్ల నవదీప్
- ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి
ఈ ప్రమాదంలో నవదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మణి, ప్రేమ్ చంద్ ప్రాణాలు విడిచారు. ప్రేమ్ జ్యోతికి మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.