ఢిల్లీ నుంచి వచ్చేయండి: ఎంపీలను ఆదేశించిన చంద్రబాబు

  • ఢిల్లీలో మీరు ఉద్యమించిన తీరు బాగుంది
  • మన పోరాటం అందరి దృష్టికి వెళ్లింది
  • ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉద్యమించిన టీడీపీ ఎంపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడం, రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టడంలాంటి కార్యక్రమాలతో మనం చేస్తున్న పోరాటం అందరి దృష్టికి వెళ్లిందని చెప్పారు. రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఎంపీలకు చంద్రబాబు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చేయాలని ఎంపీలను ఆయన ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో రేపు ఉదయం కల్లా టీడీపీ ఎంపీలు ఏపీకి చేరుకోనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
mps
protest

More Telugu News