మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారుకు స్వల్ప ప్రమాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారుకు స్వల్ప ప్రమాదం

  • మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళుతుండగా ప్రమాదం
  • కారును రాసుకుంటూ వెళ్లిన ఆర్టీసీ బస్సు
  • వేరే వాహనంలో వెళ్లిపోయిన దినేష్ రెడ్డి
మాజీ డీజీపీ దినేష్ రెడ్డి  బుల్లట్ ప్రూఫ్ కారుకు స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న ఆయన కారు పెద్దమ్మదేవాలయం వద్దకు రాగానే పక్క నుంచి వెళుతున్న ఆర్టీసీ బస్సు రాసుకుంటూ వెళ్లింది. దీంతో, కారు స్వల్పంగా దెబ్బతింది. ఆ వాహనం నుంచి దిగిపోయిన దినేష్ రెడ్డి వేరే వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. నిన్న జరిగిన ఈ సంఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు వాహనాలను స్టేషన్ తరలించారు.
former dgp
dinesh reddy

More Telugu News