వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కే అవకాశమే లేదు: సీపీఎం మధు జోస్యం
- కడపలో సీపీఐ ప్రతినిధుల సమావేశానికి హాజరైన మధు
- ఇన్నాళ్లూ ప్రత్యేకహోదా అంటే చంద్రబాబు ఎగతాళి చేశారు
- రాష్ట్రానికి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు నష్టం కలిగించాయి
ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదు
ఏపీలో కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన సాగుతోందని, ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదని ఏపీ అంటే అనంతపురం టూ పార్వతీపురం అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తూ, వెనుకబడిన ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర మహాసభల్లో పీపుల్స్ అజెండా పెడతామని, చంద్రబాబు, జగన్ పరస్పర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఏపీకి నిజంగా హోదా సాధించాలనే చిత్తశుద్ధి కనుక ఉంటే అందరినీ కలుపుకోవాలని రామకృష్ణ సూచించారు.