44 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన లియాండర్ పేస్

  • 44 ఏళ్ల వయసులో డేవిస్‌ కప్ మ్యాచ్ గెలిచిన లియాండర్ పేస్
  • రోహన్ బోపన్నతో కలిసి చైనా ద్వయంపై విజయం
  • 43 డబుల్స్ విజయాలతో ప్రపంచ రికార్డు
భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ 44 ఏళ్ల వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్‌ కప్‌ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో  గాంగ్‌-జీ జాంగ్‌ జోడీని 5-7, 7-6(5), 7-6(3) తేడాతో లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీ ఓడించింది. దీంతో ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా పేస్‌ రికార్డులకెక్కాడు. డేవిస్‌ కప్‌ డబుల్స్‌ లో పేస్‌ కి ఇది 43వ విజయం. ఇంతవరకు ఇటాలియన్‌ ఆటగాడు నికోల పిట్రాంగెలితో కలిసి 42 విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచిన పేస్‌ తాజా విజయంతో చరిత్ర సృష్టించాడు. 1990లో జీషాన్‌ అలీతో కలిసి తొలిసారి ఆడిన లియాండర్‌ పేస్‌ సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Go Back to Shorts
tennis
liander pace
devis cup

More Telugu News